విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆజాదికా అమృత్ మహోత్సవ లో భాగంగా రాష్ట్ర స్థాయి పోషకాహార ప్రదర్శన మరియు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను గొల్లపూడిలోని టి.టి.డి.సి లో బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్పీ) వారి ఆధ్వర్యములో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ.యం.డి.ఇంతియాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విజయనగరం, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య జిల్లా, తిరుపతి, కర్నూల్, ఏలూరు, అల్లూరిసీతారామరాజు, బాపట్ల, సత్యసాయి, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా,డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మరియు యస్.టి.ఆర్ జిల్లాల నుండి చిరు ధాన్యాలతో ఆహార ఉత్పత్తులు తయారు చేసే స్వయం సహాయక సంఘాలు మరియు రైతు ఉత్పత్తి దారుల సంఘాల మహిళలు స్టాల్స్ ను ఏర్పాటు చేసి వారు తయారుచేసిన ఆహార ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భం సెర్ప్ సీఈవో ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ 2023 సంవత్సరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఁఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ఁ గా ప్రకటించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా చిరుధాన్యాలలో ఉన్న పోషక విలువలను తెలియజేయడం, రైతులు చిరుధాన్యాలను పండించే విధముగా ప్రోత్సహించడం, చిరుధాన్యాలు పండించడం వల్ల భూమి సారం పెరుగుతుందని, నీటి వినియోగం తక్కువగా ఉండి, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని తెలిపారు. ముఖ్యముగా మనిషి ఆరోగ్యంగా ఉండటానికి చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిరుధాన్యాల్లో తరగతి పోషకాహార గనులు ఉంటాయన్నారు. రక్తహీనతతో బాధపడేవారు చిరుధాన్యాల వాడకంతో రక్తహీనత సమస్యను అధిగమించవచ్చునన్నారు. చిరుధాన్యాలలో ముఖ్యంగా కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలు ప్రధానమైన అన్నారు. చిరుధాన్యాల వినియోగంపై ప్రజలకు మరింత ప్రచారం కల్పించమే కార్యక్రమ ప్రధాన ముఖ్య ఉద్దేశ్యమని సెర్ఫ్ సీఈవో ఇంతియాజ్ అన్నారు. స్వయం సహాయక సంఘాలలో మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘాలలో ఉన్న సభ్యులందరూ చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం పైన పూర్తి స్థాయి దృష్టి సారించి ఈ ఆర్థిక సంవత్సరంలో 30 వేల ఎకరాలలో చిరుధాన్యాల ఉత్పత్తి జరిగేలా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమములో ,(మిల్లెట్స్), కమీషనరేట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ బాలు నాయక్ చిరుధాన్యాల ఉత్పత్తిపై ప్రభుత్వం నుండి అందించే వివిధ ప్రోత్సాహకాల గురించి వివరించారు. ఆచార్య యస్.జి రంగా యూనివర్సిటి ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ చిరుధాన్యాల విలువ జోడింపు ఏవిధముగా చేయాలి. చిరుధాన్యాలను సామాన్యులకు అందుబాటులోకి ఎలా తీసుకురావాలి, వివిధ రకాల చిరుధాన్యాలలో ఉన్న న్యూట్రిషన్ విలువ వివిధముగా ఉన్నాయి అని సభ్యులకు విశదీకరించారు. చిరుధాన్యాల ద్వారా వ్యాపార అభివృద్ధి ఏవిధముగా చేసుకోవాలి సంఘాలలోని సభ్యులు/రైతు ఉత్పత్తి దారులు, సంఘాలలోని సభ్యులు వివిధముగా వారి జీవనోపాదులను అభివృద్ధి చేసుకోవాలని తెలియచేసారు. ఈ కార్యక్రమములో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్లు విజయకుమారి, నాంచారయ్య, జి. పద్మావతి, అదనపు డైరెక్టర్ మహిత, సెర్చ్ సిబ్బంది మరియు జిల్లాల నుండి డి.పి.యం లు,
రైతు ఉత్పత్తిదారుల సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …