మహిళల అభ్యున్నతికి చేయూత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని మహిళలను ఉన్నత స్థాయిలో చూడలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం అని,అందుకే వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంక్షేమ పధకంలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. బుధవారం పటమట నందు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, హోంశాఖ మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధి గా జరిగిన వైయస్సార్ చేయూత పధకం నిధుల మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ 9,12,13,14,15,16,19డివిజన్లలో 2,627 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన 4,92,56,250/- రూపాయలను అక్కాచెల్లెమ్మల ఖాతాలలో జమ చేశారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ మహిళలకు ఆర్దిక, సామాజిక భరోసా కల్పించేందుకు జగనన్న కృషి చేస్తున్నారు అని, రాజకీయంగా కూడా నామినేటెడ్ పదవులలో మహిళాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే అసత్య ప్రచారాలు మహిళలు ఎవరు నమ్మకండి అని,జగనన్న కే సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. అవినాష్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా మహిళలకు నేరుగా ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న దాఖలాలు లేవని, కానీ జగనన్న క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత, అమ్మఒడి,వసతి దీవెన లాంటి పథకాల ద్వారా నేరుగా మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు అని కొనియాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి పధకాలు లేవని,ఉన్న వాటికి అర్హత ఉన్న సరే జన్మభూమి కమిటలకు లంచాలు ఇస్తే గాని వచ్చే పరిస్థితి ఉండేది కాదని విమర్శించారు. కానీ నేడు స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా అర్హతే ప్రామాణికంగా సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్న మహోన్నత వ్యక్తి జగనన్న అని అన్నారు.ఈ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేయడం చంద్రబాబు కి,లోకేష్ కె చెల్లిందని ఎద్దేవా చేశారు.ఒక సోదరిమని లాగా మమ్మల్ని ఆదరిస్తూ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న వనిత గారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ACG శ్యామల, PO శకుంతల, జోనల్ కమిషనర్ పార్థసారధి, 9వ డివిజన్ ఇంచార్జ్ వల్లూరి ఈశ్వర ప్రసాద్, 12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్, 13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్, 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య , 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమాడిశెట్టి రాధికా, 19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహీద్, కో ఆప్షన్ మెంబెర్ సయ్యద్ అలీమ్ మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *