సీఎం వైఎస్ జగన్ పాలనలో మహిళలకే అగ్రతాంబూలం

-చేయూత వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి, సాధికారతకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రతాంబూలం ఇస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానా నందు ఐదో రోజు జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారులచే నిర్వహించిన నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చేయూత వారోత్సవాల ద్వారా మహిళలలో నూతనోత్సాహం కనిపిస్తోందన్నారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పథకంలోనూ అక్కచెల్లెమ్మలను భాగస్వాములుగా చేస్తూ.. సీఎం వైఎస్ జగన్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. సుధీర్ఘ పాదయాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను దగ్గరగా చూసిన వైఎస్ జగన్.. అక్కచెల్లెమ్మల ఆర్థికసాధికారత కోసం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే రూ. 233.26 కోట్లు మహిళా సంక్షేమానికి ఖర్చు చేసినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారికోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మూడు సంవత్సరాలుగా చేయూత పథకం అమలు పరుస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా చిరు వ్యాపారాలకి పెట్టుబడి సాయం కోసం బయట అప్పులు చేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే రూ.18,750 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మూడు విడతల్లో సెంట్రల్ నియోజకవర్గంలోని 10,875 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 43 కోట్ల 38 లక్షల లబ్ధి చేకూర్చగా.. ఈ ఏడాది రూ. 20 కోట్ల 39 లక్షల 6 వేల 250 రూపాయలు వారివారి ఖాతాలలో జమ చేసినట్లు తెలియజేశారు. అలాగే 58వ డివిజన్ లో 670 మందికి రూ. 1.25 కోట్లు., 60 వ డివిజన్లో 834 మందికి రూ. 1.56 కోట్లు., 61 వ డివిజన్లో 493 మందికి రూ. 92 లక్షలు.. మొత్తంగా 1,997 మందికి రూ. 3.74 కోట్లు బ్యాంకు ఖాతాలలో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సాయాన్ని పశువుల పెంపకం, పాల సేకరణ, పచ్చళ్లు, తినుబండారాలు, కిరాణా, వస్త్ర, పండ్లు, కూరగాయల దుకాణాలు వంటి జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సంపద సృష్టి జరిగి, సుస్థిరమైన జీవనోపాధి దొరుకుతుందన్నారు. అంతేకాకుండా కీలక మంత్రిత్వ శాఖలు, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థలు, కాంట్రాక్టులు, ఇతర పనుల్లో ఆడపడుచులకు రిజర్వేషన్లు కల్పించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా నిలిచారని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా మహిళల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మల్లాది విష్ణు ప్రవేశపెట్టిన తీర్మాణానికి హర్షాతిరేకాలతో అక్కచెల్లెమ్మలు ఆమోదం తెలిపారు.

నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబాలలోని మహిళల ఆర్థిక బలోపేతానికి వైఎస్సార్ చేయూత పథకం ఎంతగానో దోహదపడుతోందన్నారు. వరుసగా మూడేళ్ల పాటు అందిన సాయంతో మహిళలు మెరుగైన జీవన ప్రమాణాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు చెందిన పలువురు మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా తమకు కలుగుతున్న లబ్ధిని, వ్యాపార ఎదుగుదలను వివరించారు.టి.జ్యోతి లబ్ధిదారు మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మూడేళ్ల పాటు అందిన సాయంతో పాటు బ్యాంకు లోన్ ద్వారా తీసుకున్న మొత్తంతో కిరాణా దుకాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీంతో తమ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి దయ వల్ల సొంతింటి కల కూడా నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మల్లాది విష్ణు చేతులమీదుగా లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సిడిఓ జగదీశ్వరి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు బెవర నారాయణ, బత్తుల దుర్గారావు, అఫ్రోజ్, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *