మహాకవి జాషువా సాహిత్యం అజరామరం

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేస్తూ.. తన సాహిత్యం ద్వారా సాంఘిక అసమానతలపై పోరాడి పద్యానికి ప్రాణం పోసిన మహాకవి గుర్రం జాషువా అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వెయ్యేళ్ల సాహిత్య చరిత్రలో గుర్రం జాషువాది ప్రత్యేక స్థానమని కీర్తించారు. తన సాహిత్య ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయకుండా చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పేవారని తెలిపారు. త‌న పదునైన క‌విత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేశారన్నారు. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి ర‌చ‌న‌ల‌ను అందించడంతో పాటు అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన న‌వ‌యుగ క‌వి చ‌క్రవ‌ర్తి కొనియాడారు. ఓవైపు దుర్భర దారిద్ర్యం, వర్ణ వివక్ష, కులమత బేధాలు ఎదుర్కొంటూనే.. మరోవైపు గబ్బిలం, ఫిరదౌసి, క్రొత్త లోకం వంటి అద్భుత కావ్యాలను రచించారన్నారు. విశ్వనరునిగా ఎదిగిన జాషువా ప్రస్థానం నేటి సాహిత్య ప్రముఖులకు, కవులకు ఆదర్శం కావాలని మల్లాది విష్ణు అన్నారు. అలాగే సమాజం కూడా జాషువా చెప్పిన మాటలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు గుండె సుందర్ పాల్, బూదాల శ్రీనివాస్, ఎం.కమలాకర్, ఎం.సురేష్, ఎన్.రమేష్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *