విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ వించిపేటలోని శ్రీశ్రీశ్రీ వడ్డా పోలమాoబ దేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం అమ్మవారు శ్రీశ్రీశ్రీ వడ్డా పోలమాoబ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, మహిళలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం వేళ భక్తులు మేళతాళాలతో కూడిన సంబరాలతో ఆలయానికి వచ్చి అమ్మవారికి తన మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో స్థానికులు అందరూ పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలు పొందాలని కోరారు. కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ
వడ్డా పోలమాoబ దేవి కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …