– చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం నిర్వహిస్తున్న దసరా మహిళా సాధికారత ఉత్సవానికి మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చి రాజమహేంద్రవరం చరిత్రను చాటేలా జయప్రదం చెయ్యాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ ఆనం కళాకేంద్రంలో దసరా మహిళా సాధికారత ఉత్సవం ఏర్పాట్లు పై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, కమిషన్ సభ్యురాలు జయశ్రీ తో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ , స్వాతంత్య్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల అభివృద్ధి, సాధికారాత గురించి ఎవరెన్ని మాట్లాడినప్పటికీ గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలు కొరకు చేస్తున్న అభివృద్ధి తో పోల్చుకుంటే తక్కువే అన్నారు. సమాజం లో 50 శాతం మహిళలు వున్నప్పుడు వారి అభివృద్ధి సాధికారేతే లక్ష్యంగా అన్నిరంగాల్లో వారు అభివృద్ధి చెందాలనే దృక్పధం తో అన్ని చోట్లా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్మానించారన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ సమాజంలో వారికి సమాన హక్కులు కల్పించడం జరిగిందన్నారు. మహిళలు ఆర్ధికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేందుకు ప్రభుత్వం వారికి అండగా నిలబడి అమ్మఒడి, చేయూత వంటి పథకాలతో పాటు 30 లక్షల ఇళ్ల పట్టాలను ఆస్తి హక్కును మహిళలకే కల్పిస్తూ స్థలాన్ని, ఇంటి పట్టాలను మహిళలు పేరునే ప్రభుత్వం అందించిందన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళా సాధికారం జరుగుతున్న తీరును ప్రదర్శించే దిశగా ” “దసరా మహిళా సాధికారత” ను ఉత్సవంగా జరుపుకునే ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చెయ్యాలన్నారు.
శనివారం నిర్వహించే ఈకార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర మహిళా మంత్రులు తానేటి వనిత , ఆర్కే రోజా, ఉష శ్రీచరణ్, విడదల రజని, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, మహిళా పార్లమెంట్ సభ్యులు వంగా గీత, చింతా అనురాధ, గొట్టేటి మాధవి, బి. సత్యవతి, వైఎస్ఆర్ సి పి కేంద్ర కమిటీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, నాగులపల్లి ధనలక్ష్మి, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత, తదితరులు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, జిల్లా కలెక్టర్ డా. కే మాధవి లత, రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, అడిషనల్ ఎస్పీ సిఐడి కేజీవి సరిత, తదితరులు హాజరు కానున్నారని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.