విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బజాజ్ ఆటో అధునాతన వెర్షన్ పల్సర్ ఎన్ 160 బైక్‌ను శుక్రవారం వరుణ్ బజాజ్, విజయవాడ షోరూంలో యం.వి.దుర్గారావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అఫ్ పోలీస్ (కృష్ణలంక పిఎస్) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బజాజ్ ఆటో ఏరియా సేల్స్ మేనేజర్ సదత్ బాషా మాట్లాడుతూ 160 సిసి సెగ్మెంట్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ ఫీచర్ ని భారతదేశంలోనే మొదటిసారి బజాజ్ ఆటో ప్రవేశపెట్టిందన్నారు. పి.వి.సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వరుణ్ బజాజ్ మాట్లాడుతూ ఈ బైక్‌ను 4 – స్ట్రోక్, 2-వాల్వ్, సింగల్ ఓవర్ హెడ్ క్యాం షాఫ్ట్ ,లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టమ్‌తో రూపొందించారన్నారు. 16 హెచ్.పి, 14.65 ఎన్.ఎం. టార్క్ అందించగల, 5 – స్పీడ్ గేర్ బాక్స్, ఇందులో ఉన్నాయన్నారు. అదనంగా బి ఫంక్షనల్ ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, స్పోర్టీ అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కలిగియున్నదన్నారు. పల్సర్ ఎన్ 160 2 వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. వీటి ఎక్స్ షోరూం ధర సింగల్ ఛానల్ ఎబిఎస్ రూ. 1,22,982లు, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ రూ.1,27,981 లుగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బజాజ్ ఆర్‌ఎం కరుణాకర్, జిఎం సేల్స్ పద్మజ, కస్టమర్లు మరియు వరుణ్ బజాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గత ప్రభుత్వానిది స్కాముల్లో రికార్డు… కూటమి ప్రభుత్వానిది స్కీమల్లో రికార్డు
-పాడి రైతులు న్యూజిలాండ్ తరహాలో ప్రగతి సాధించాలి -గత ప్రభుత్వంలో నాయకుల సొంత డెయిరీలను పెంచుకున్నారు -తిరుపతి దుర్ఘటన విషయంలో …