విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం, ఫారమ్-6 బి, ఓటర్ల నుంచి ఆధార్ వివరాలు సేకరణ, అప్ డేషన్, ఫ్రీ రివిజన్ ఆఫ్ ఎస్‌ఎస్ ఆర్ కార్యాచరణ, పోలిగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, ఓటర్ల జాబితా పై ఎన్నికల అధికారి ద్వారా విశ్లేషణ, టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఓటర్ల జాబితా, రాజకీయ పార్టీలు నుంచి వచ్చిన ఫిర్యాదులు పై చర్యలు, తదితర అంశాలపై గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, బిఎల్‌వోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో వాటర్ డేటాకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా ఆధార అనుసంధానం ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో జిల్లాతో పోలిస్తే కొంత వేగవంతం చేయవలసిన అవసరం ఉందని దీనిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, నియోజవర్గంలో రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …