విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో బర్ఫీస్ హౌస్ ఆఫ్ స్వీట్స్ స్థానిక పంట కాలువ రోడ్డు లో, విశాల్ మార్ట్ ఎదురుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా షాపు యజమాని వి.శ్రీరామ్ మాట్లాడుతూ ఈ షాపులో అన్ని రకముల స్వీట్స్ సొంతంగా తయారుచేసి అతి తక్కువ ధరలకు అమ్ముతామని నిర్వాహకులు వి శ్రీరాం అన్నారు. మావద్ద అన్నమయ్య లడ్డు మా ప్రత్యేకత అని భగవాన్ పూతరేకులు ఎన్నో రకాల స్వీట్స్ స్వచ్ఛమైన నేతితో తయారుచేసి తయారు చేస్తామని అన్నారు. స్వీట్స్ లో ఎన్నో రకాలు ఉంటాయని అవన్నీ కూడా మా వద్ద అందుబాటు ధరలతో దొరుకుతాయని శాఖాహార, మాంసాహార, పికిల్స్ సొంత తయారీతో దొరుకుతాయని అన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫంక్షన్లకి, పార్టీలకు ,పెళ్లిళ్లకు ,అన్ని శుభకార్యాలకు మా వద్ద అన్ని రకముల స్వీట్స్ పికిల్స్ అందుబాటులో ఉంటాయని తప్పక అందరూ వినియోగించుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు స్వీట్ షాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …