-ఏ .శ్రీహరి నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీ లు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అమలు చేయాలని ,విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జే.ఏ.సీ. అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరినాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షెడ్యూల్ 9, 10, 13 ,లో పొందుపరిచిన అన్ని సంస్థలు తక్షణమే నెలకొల్పాలని ,కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న లక్షల ఖాళీలలో ఉద్యోగులను భర్తీ చేయాలని, ఉత్తర ఆంధ్ర ,రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు హామీని అమలు పరచాలని ఆయన అన్నారు. తదనానంతరం వైస్ ప్రెసిడెంట్ వీసం వెంకట ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి విభజన అనంతరం రావలసిన వాటాలను ,నిధులను కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే విడుదల చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ను నిలుపుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నీ అమలు పరచాలని డిమాండ్ చేశారు .త్వరలోనే మేము బస్సు యాత్ర కొనసాగిస్తామని విభజన హామీలు నెరవేరే వరకు పోరాడుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆప్ మర్చంట్స్ మంగళగిరి జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి జేఏసీ గంగరాజు సాయి కృష్ణ నవ్యాంధ్ర విద్యార్థి యువజన జేఏసీ డి.ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.మహేంద్ర నాయుడు, నాన్ పొలిటికల్ జేఏసీ కార్యదర్శి పసుపులేటి వెంకటేశ్వరరావు, నాన్ పొలిటికల్ జేఏసీ సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.