రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లా సమగ్ర అభివృద్ధి, అన్నీ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం సాధించడం లో జిల్లా రెవెన్యూ అధికారి బాధ్యతలు కీలకం అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి గా బాధ్యత లు స్వీకరించిన జీ. నరసింహులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వం కలిసి మొక్కను అందచేశారు. తూర్పు గోదావరి జిల్లా కు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులైన జి. నరసింహులు శనివారం విధుల్లో జాయిన్ అయ్యారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ డా. మాధవీలత మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. డి ఆర్ వో జి. నరసింహులు ప్రధాన కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) కార్యాలయంలో సహాయ కార్యదర్శి గా పని చేస్తూ బదిలీపై తూర్పుగోదావరి జిల్లాకు డి ఆర్ ఓ గా నియమితుయ్యారు. గతంలో వీరు నంద్యాల, తెనాలి, తిరుపతి ఆర్డిఓ గాను, ప్రకాశం జిల్లాలో డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, , కమీషనర్ సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం లో జాయింట్ డైరెక్టర్ గాను పని చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ ను కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. డిఆర్ఓ ను అభినందించిన వారిలో ఆర్డిఓ ఎస్ మల్లిబాబు, ఏ చరిత్ర వర్షిని, కలెక్టరేట్ ఏవో జి భీమారావు, జిల్లా అధికారులు తహసిల్దార్లు ఎంపీడీవోలు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Tags rajamendri
Check Also
ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం
-తద్వారా వాటి పనితీరు మెరుగుపరుద్దాం -సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయాలి -యూస్ కేసెస్‌ను త్వరితగతిన అమల్లోకి తీసుకొచ్చేలా పనిచేయండి -త్వరలో అందుబాటులోకి …