Breaking News

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తొలి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ  సమావేశం

-బాల కార్మిక వ్యవస్థ లేకుండా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి
-జిల్లా, మండల స్థాయి లో నూతన కమిటీలు ఏర్పాటు
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అధికారులు కార్యచరణతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై తొలి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో బాలకార్మికులు వ్యవస్థ నిర్ములనే లక్ష్యంగా టాస్క్‌ఫోర్స్ కమిటీలు జవాబుదారీ తనం తో కూడి దాడులు నిర్వహించాలన్నారు. బడిలో వుండాల్సిన పిల్లలు బడి బయట ఎక్కడ కనిపించినా వారిని గుర్తించి వారి తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ చేసి పిల్లల భాద్యతలను తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జిల్లాలో అక్టోబర్ 10వ తేదీ నుండి నవంబర్ 7వ తేదీ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు బాల కార్మికులను గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేస్తారని అన్నారు. కార్మిక శాఖ ప్రతి వారం నిరంతరం తనిఖీలు చేస్తూ ఆయా సంస్థల యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు. తప్పిపోయిన, వేధింపులకు గురవుతున్న, ఇంటి నుంచి పారిపోయిన, అక్రమ రవాణాకు గురవుతున్న బాలల, బాల కార్మికులుగా పనులు చేస్తూన్న బాలలు, ప్రకృతి వైపరీత్యాలకు గురై అనాథలైన సంరక్షణ లేని బాలలు, రక్షణ అవసరమైన బాలలందరును గుర్తించి, ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా సంరక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి నెల డివిజన్, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

ఇటీవల కాలంలో జిల్లా లో వివిధ ప్రాంతాల్లో గల బాల కార్మికుల ద్వారా పనులు చేయిస్తున్న సంస్థల పై దాడులు నిర్వహించి బాల కార్మికులు గా పని చేస్తూన్న 15 మందిని గుర్తించి ఆయా సంస్థలపై కేసులు నమోదు చేసి ఫైన్ విధించడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి. ఎస్. ఎం. వల్లీ వివరించారు.

పిల్లలను రక్షించడం, పని చేసే పిల్లల ఆయా కార్యకలాపాల నుంచి విడుదల చేయడం, వలస వచ్చిన పిల్లలను స్వస్థలాలకు రప్పించడం, జిల్లాలో పని నుండి ఉపసంహరించుకున్న పిల్లలందరికీ పునరావాసం కల్పించడం కోసం ఒక చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. కార్మిక శాఖ నిరంతర పర్యవేక్షణ, గుర్తింపు, అనుసరణ ప్రయత్నాల కారణంగా జిల్లాలో బాలకార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు వివరించారు. జిల్లాలో బాల కార్మికుల గుర్తింపు, విడుదల, రెస్క్యూ, పునరావాసం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో దాడులు నిర్వహించేందుకు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సంబంధిత శాఖల ద్వారా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, అసిస్టెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్.. బిఎస్ఎన్ వల్లి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు వి.శేఖర్, టీఎస్. కార్తీక్, ఎం. లలితకుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ పి. సూర్య ప్రభావతి, డిఎంహెచ్వో (ఇంచార్జ్) డా. జి వరలక్ష్మి, డీఈవో ఎస్ అబ్రహం, జిల్లా ప్రొబిషన్ అధికారి (ఇంచార్జ్) బి. రవికుమార్,ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్.. జి . స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా బాల కార్మిక వ్యవస్థ నిర్ములనపై గోడ ప్రతులను ఆవిష్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *