Breaking News

రైతుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభూత్వ లక్ష్యం..

-రైతుల ఆర్థిక భరోసాకు ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రా లు  ఏర్పాటు…
-వ్యవసాయాన్ని పండగ చేసిన జగనన్న ప్రభుత్వం
-రాష్ట్ర హోమ్ మంత్రి, తానేటి వనిత

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త:
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారి అభి వృద్ధి కాంక్షిస్తూ ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రా లు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక ఎదుగుదలకు భరోసానిస్తుందని రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత అన్నారు.

శనివారం చాగల్లు గ్రామం లో రు.21.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి తానేటి వనిత ప్రారం భించారు. ఈ సం దర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ గ్రామం లో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాలు ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు మెరుగైన సూచనలు, సలహాలు ఇచ్చి రైతు లాభసాటిగా వ్యవసాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నా మన్నా రు.
ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినపుడు రైతుల పంటలు కాపాడు కోవడానికి తగు సూచ నలు చేసి వారిలో ధైర్యం కల్పిస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించుటకు ఆర్భికెలు ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు లకు మద్దతు ధర లభించే విధంగా చర్య లు తీసుకుంటు న్నామన్నారు. రైతు పక్షపాతిగా
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు లకు అండగా నిలబడి వారి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పా టు చేసి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులో ఉంచి అందిస్తున్నారు. రైతు కు ఎటువంటి సమస్య ఉత్పన్నమైన మండల కేంద్రాలకు వెళ్ల కుండా వారి గ్రామంలోని ఆర్బికే లు ద్వారా సమస్యను పరిష్కరించుకొనేవిధంగా ప్రాభిలుత్వం రైతు సంక్షేమనికి కృషి చేవాటిందన్నారు.

ఈ కార్యక్రమం లో ఆత్మ చైర్మన్ గండ్రోతు సురేంద్ర కుమార్, ఎం పి పి మట్టా వీరాస్వామి, సర్పంచి ఉన్నమట్ల మనశాంతి, స్థానిక నాయకులు జె. కొండలరావు, జి. శ్యామ్, మద్దూకూరి రవి, ఉన్నాకూటి విజయకుమారి సిహేచ్ దుర్గ మల్లేశ్వరరావు, ఎంపిడిఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌భుత్వ శాఖ‌లకు ఆర్టీజీఎస్ సాంకేతిక స‌హ‌కారం

-త‌ద్వారా వాటి ప‌నితీరు మెరుగుప‌రుద్దాం -సీఎం ఆశ‌యాల‌క‌నుగుణంగా ప‌నిచేయాలి -యూస్ కేసెస్‌ను త్వ‌రిత‌గ‌తిన అమ‌ల్లోకి తీసుకొచ్చేలా ప‌నిచేయండి -త్వ‌ర‌లో అందుబాటులోకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *