పెద్దలను గౌరవించాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పెద్దలను గౌరవించాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గవర్నర్‌పేట స్వాతంత్ర సమర యోధుల భవన ప్రాంగణంలో నిర్వహించిన ప్రపంచ వృద్దుల దినోత్సవ సభకు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు స్థానిక శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వృద్దులు దేవుళ్ళతో సమానమని వారిని గౌరవించడం మన కర్తవ్యమన్నారు. మనకు జన్మనిచ్చి ఉన్నత స్థితికి తీసుకువచ్చిన వారిని అప్యాయంగా చూసుకోకుండా ఓల్డెజ్‌ హోమ్‌లకు పంపించడం అనేది సరైన పద్దతి కాదని బాధకరమైన విషయమన్నారు. కుటుంబంలో మనం పెద్దవాళ్ళతో ఒక గంట గడిపితే ఎన్నో అనుభావాలను వారి నుండి పొందవచ్చునన్నారు. వృద్దాప్యంలో అనారోగ్యం సహజమని ప్రతీ ఒక్కరూ వృద్దాప్య దశకు చెరుకుంటామన్నారు. మారుతున్న పరిస్థితులలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం యువత విదేశాలలో స్థిరపడుతున్నారని వృద్ధులైన వారి తల్లిదండ్రులను ఓల్డెజ్‌ హోమ్‌లలో చేర్పించుతున్నారన్నారు. వృద్దులు దూరమైన పిల్లల మీద ఉన్న మమకారం, అప్యాయతలను పంచుకోలేకపోతునామనే మనోవేధనకు గురి అవుతున్నారన్నారు. ముఖ్యంగా మనవడు మనవరాళ్ళతో గడిపే అదృష్టాన్ని కోలుపోతున్నామనే బాధతో వారు మరింత అనారోగ్యానికి గురి అవుతున్నారన్నారు. అటువంటి వారిని హక్కున చేర్చుకుని అప్యాయతతో పలకరిస్తూ మనమే వారికి సొంత బిడ్డల వలే మెలిగిన్నప్పుడు వారు కొంత ఉపశమనం కలిగి ఆనందంగా జీవిస్తారని ఈ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ పూర్వకాలంలో తల్లిదండ్రులు తాతముత్తాతల వరకు ఉమ్మడి కుటుంబంతో ఆనందంగా జీవించేవారన్నారు. కుంటుంబంలో ఎటువంటి భాదలు ఇబ్బందులు ఎదురైన ఒకరికొకరు పంచుకునేవారన్నారు. ప్రస్తుత కుంటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులు చాలా బాధాకరమన్నారు. నేటి కాలంలో మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలకే అధిక ప్రాధ్యానత ఇస్తున్నారన్నారు. వృద్దులను గౌరవించి వారి పట్ల ప్రేమ అప్యాయతను పంచుకోవాల్సిన అవసరం సమాజంలో ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. 60 సంవత్సరాలు దాటిని వృద్దులను సీనియర్‌ సిటిజన్‌గా పరిగణిస్తున్నామని 80 సంవత్సరాలు దాటిని వృద్దులను సూపర్‌ సిటిజన్ల్‌గా పరిగణించి వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సహాయకారిగా ఉంటుందన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులు గౌరవించి వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని శాసనసభ్యులు అన్నారు.
జాతీయ వృద్ధుల హెల్ప్‌ లైన్‌
వృద్ధాశ్రమాలు, సంరక్షణ కేంద్రాలు, కార్యాయచణ కేంద్రాలు, హాస్పిటల్స్‌ సంబంధించిన సమాచారం, వృద్దులను హింసించినా, ఇంటి నుండి బయటకు గెంటివేయబడిన వారి రక్షణ ఏర్పాటు, పెన్షన్‌, చట్టపరమైన సమస్యలపై సలహాలు సూచనలు, భావోద్వేగమైన విషయాలను పంచుకునేందుకు అందుబాటులో ఉండేలా జాతీయ వృద్దుల హెల్ప్‌లైన్‌ 14567 నుపై ప్రతి ఒక్కరికి అవగహన కల్పించే పాంప్లేట్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో 10 మంది వయో వృద్దులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా విభిన్నప్రతిభావంతులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ అధికారి బి. రామ్‌కుమార్‌, సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫెర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వేమూరి బాబురావు, కార్యదర్శి యం వెంకటేశ్వరరావు, సర్వోదయ ట్రస్ట్‌ అధ్యక్షులు డా. జి.వి మోహన్‌ప్రసాద్‌, వయో వృద్దులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *