ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆరవ రోజు శనివారం కనకదుర్గ అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఆలయ ఈవో బి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో వేదపడింతుల ఆశీర్వచనాలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం మహాలక్ష్మీ అలంకారంలో ఉన్నఅమ్మవారి చిత్రపటాన్ని సమర్పించారు. అనంతరం మీడియా పాయింట్ నుండి మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ఆనందదాయకమన్నారు. భక్తులకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. ఆదివారం సరస్వతి దేవి అలంకారంలో దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశము ఉన్నందున తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ప్రతీరోజు డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి ప్రత్యక్షంగా భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తూ ఏరోజుకు ఆరోజు తగిన విధంగా మార్పులు చేపడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలుగకుండా మౌలిక సదుపాయాలకు అవసరమైన తగు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే అసంఖ్యాక భక్తులకు కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసు కొనేందుకు అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపైన ప్రజలందరి పైన ఉండాలని కోరుకున్నానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Tags indrakiladri
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …