విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అహింస, సత్యాలను ఆయుధాలు గా చేసుకుని శాంతియుతంగా స్వాతంత్ర్య పోరాటం జరిపి దేశానికి స్వాతంత్య్రం అందించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం నాడు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని, సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైస్సార్సీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. దేశ 2వ ప్రధానిగా లాల్ బహుదూర్ శాస్త్రి దేశ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, నిరాడంబరంగా నిజాయితీగా పరిపాలన చేసి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆ మహానుభావులను ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో ప్రజా సమస్యల పరిష్కరానికి పాటు పడుదమని అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, మాజీ కార్పొరేటర్ కోటి నాగలు, వైస్సార్సీపీ నాయకులు సొంగా రాజ్ కమల్, డేవిడ్ రాజు, భీమిశెట్టి బాబు, ప్రభు, గల్లా రవి, మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …