విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి పేదవారికి కూడా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం 14వ డివిజన్ గోవిందరాజు హైస్కూల్ నందు నాడు నేడు ద్వారా 90లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేదవారికి కూడా నాణ్యమైన ఉన్నత విద్య ను అందించాలని తద్వారా వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో, ఆసుపత్రిలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. కేవలం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే నాడు నేడు కింద దాదాపు 23కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రిలు అభివృద్ధి చేయడం జరిగిందని తెలుపుతూ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ స్కూళ్లకు దోచి పెట్టారని, బిడ్డల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు భారమైన సరే అక్కడే చేర్పించారు అని వారి కష్టాలను స్వయంగా చూసిన జగన్ గారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాటశాల ల మీద ప్రత్యేక దృష్టి పెట్టీ వాటిని మొరుగుపర్చి వారికి అండగా నిలిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబెర్ చింతల సాంబశివరావు, స్కూల్ ఉపాధ్యాయులు రామకృష్ణ,శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …