విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జాతిపిత మహాత్మాగాంధీజీ 153వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రవచించిన శాంతి, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. గాంధీజీ జీవితం ఆదర్శాలు జాతికి సదా అనుసరణీయ మార్గాలన్నారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. దేశానికి అహింస మార్గంలో స్వాతంత్య్రాని సముపార్జించి పెట్టిన సత్య శోధన చేసిన మహా జ్ఞాని బాపుజీ అన్నారు. గాంధీజి ఆశయ సాదనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …