-పూర్తి చేసిన రీసర్వే సర్టిఫికేట్లను పునపరిశీలించుకోవాలి..
-జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాల రీ సర్వే పనులపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్‌డివోలు, ఏడి, తహాశీల్థార్లు, మండల సర్వేలు, విఆర్‌వోలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రీ సర్వే పనులు మరింత వేగవంతం చేసి నిర్థేశించిన సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాలకు సంబంధించి ఇంకనూ మిగిలిన రీ సర్వేను వెంటనే పూర్తి చేయాలన్నారు. జగ్గయ్యపేట మండలం కంచికచర్ల, ఏ కొండూరు, తిరువూరు, ఆంజనేయపురం, విస్సన్నపేట, గంపలగూడెం మండలాలలోని గ్రామాలలో పూర్తి చేయవలసిన రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. 14 గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్ మరో 14 గ్రామలలో గ్రౌండ్ వాలిడేషన్, 41 గ్రామాలలో డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి అయిన్నప్పటికి 136 గ్రామాలలో భూ సర్వేను నిర్వహించి చివరి దశ అయిన 13వ నోటిఫికేషన్‌తో అన్ని మండలాలలోని పెండిరగ్‌లో ఉన్న రీ సర్వే పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు పూర్తి చేసిన రీ సర్వే పనుల దృవపత్రాలను మరల పరిశీలన చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ రీ సర్వే అధికారులను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ కె. సూర్యారావు తదితరులు ఉన్నారు.