విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాలకు అన్ని విధములుగా సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల వారికి స్వచ్ఛంద సంస్థల వారికి, మీడియా ప్రతినిధులు, ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు పోలీస్ కమీషనర్ తెలిపారు. విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ది.26.09.2022వ తేదీ నుండి ది.05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని దసరా పర్వదినంతో పాటు, మూలా నక్షత్రం, విజయదశమి, రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్వా నగర ప్రజలకు ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తూ, ఎక్కడా కూడా దొంగతనాలు జరుగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు అస్కారం లేకుండా అంకిత భావంతో, బాధ్యతగా విధులు నిర్వహించి, విజయ వంతంగా ఉత్సవాలు నిర్వహించుటలో తోడ్పాటు నందించిన దేవాదాయశాఖ, రెవిన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలవారికి మరియు ప్రజా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల వారికి, భక్తులకు, భవానీలకు, మీడియా ప్రతినిధులకు మరియు అన్ని విభాగాల వారికి, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులకు, లోకల్ పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., ప్రత్యేకంగా హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ నేపధ్యంలో శుక్రవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నందు ఇతర జిల్లాల నుండి దసరా మహోత్సవాల బందోబస్త్ నిర్వహించడానికి వచ్చిన పోలీస్ అధికారులకు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. శ్రీ కనకదుర్గ అమ్మవారి శేష వస్త్రం, ఫోటో మరియు లడ్డు ప్రసాదం అందించి అభినందనలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో నగర పోలీస్ కమీషనర్ తో పాటు డి.సి.పి. విశాల్ గున్ని ఐ.పి.ఎస్., పశ్చిమ ఇన్ ఛార్జ్ డి.సి.పి. కొల్లి శ్రీనివాస్, అడ్మిన్ ఇన్ ఛార్జ్ డి.సి.పి. పి.వెంకటరత్నం, ఎస్.బి.ఏ.డి.సి.పి. సి.హెచ్.లక్ష్మీపతి, ఎస్.ఈ.బి. అడిషనల్ ఎస్.పి. సత్తిబాబు, ట్రాఫిక్ ఏ.డి.సి.పి. సర్కార్ , ఏ.సి.పి.లు మరియు ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు.