ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సదస్సు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సదస్సు శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు కే బి శ్రీధర్, జాతీయ గౌరవ అధ్యక్షులు మాజీ మినిస్టర్ మూలింటి మారెప్ప, జాతీయ మహిళా విభాగం నాయకురాలు అంజనీ దేవి, రాష్ట్ర నాయకులు గంగిరెడ్డి, రాజా రామ్మోహన్ రెడ్డి, నంది కొండల రావు  పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథి కే బి శ్రీధర్ మాట్లాడుతూ అణగారిన ప్రజల పార్టీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అన్నారు. అణగారిన ప్రజలను అభివృద్ధిలో పాలనలో భాగస్వాములుగా చేయాలని అందుకు మన ఓట్లు మనం వేసుకొని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చట్టసభలకు పంపాలని అన్నారు. 75 సంవత్సరాల నుంచి అణగారిన ప్రజలను ఓటు బ్యాంకు గానే వాడుకున్నారే గాని అభివృద్ధిలో పాలనలో భాగస్వాములు చేయలేకపోయారని అన్నారు. ఆంధ్ర ప్రజలకు ఏపీ పాలనలో రాజధాని ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో సాధించడంలో విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వ రంగం తో పాటు ప్రైవేట్ రంగాల్లో సామాజిక వర్గాల వాటా ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. దళితులకు మూడు ఎకరాలు వ్యవసాయ భూమి ఇవ్వాలని అందరిని అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు బీసీలు ఎస్సీ, ఎస్టీలకు అందడం లేదని ఐ పి టి యు సి రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ మాట్లాడుతూ ప్రజల నుండి ప్రజల వద్దకు ప్రజా ప్రయోజనాలు ప్రజా సంక్షేమం ప్రజాస్వామ్యం ప్రాతిపదికన ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర విభజనతో అన్యాయం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ కి తిరిగి న్యాయం చేసే విషయంలో ఈ నాయకులంతా వైపల్యం చెందారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరి ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఒక చట్టం చేసినప్పటికీ ఎందుకనో ఈ ప్రభుత్వం అయిన కాడికి అప్పులు చేస్తూ అందిన కాడికి ఆస్తుల్ని అమ్మేస్తూ అధిక ధరల భారాన్ని ప్రజలపై మోపి ప్రజల జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తుందని అన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్  జై బాబు మాట్లాడుతూ గాంధీ అంబేద్కర్ పని విధానంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం వాటి ఉల్లంఘన పై న్యాయపరమైన చర్యలు తీసుకురావాలని అన్నారు. త్వరలో విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో మూలింటి మారెప్పకు జాతీయ గౌరవాధ్యక్షులుగా నియమిస్తూ కే బి శ్రీధర్ నియామక పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర అధ్యక్షులు నందిపాటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎలీషా గాంధీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పి టి శ్రీనివాసరావు, ఐ పి టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ గౌడ్, నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి కే గోవిందు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *