విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయబోయే విజయోత్సవ సభలో ఆవిష్కరించనున్న ప్రత్యేక సావనీర్ “నేషనల్ మెడిసిన్” బ్రోచర్ ను నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక కార్యదర్శి డా. కె.వి.రమణరాజు, పూర్వ అధ్యక్షులు డా. సి.ఎన్.మూర్తి విడుదల చేసారు. స్థానిక గవర్నర్ పేట క్షీరసాగర హాస్పిటల్ రోడ్ లోని ప్రశాంతి హాస్పిటల్స్ ఆవరణలో జరిగిన సమావేశంలో ఈ బ్రోచర్ ను నూతనంగా నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి డా. పి.వి.యస్.విజయ భాస్కర్, డా. వేముల భాను ప్రకాష్, డా. బి.వెంకట రమణ సమక్షంలో విడుదల చేసారు. ఈ సభలో నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు డా. ఎ.వి.ఎస్.కె. ప్రసాద్, డా. మురళీమోహన్, కార్యదర్శి డా. డి.పద్మజ మరియు కృష్ణ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి డా. జి.చినరాజు, డా. రత్నప్రియ దర్శిని, సావనీర్ ముఖ్య సంపాదకుడు డా. సూర్య కుమార్ పమ్మి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్
-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …