విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: “మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మంలను బోధిస్తుందన్నారు. మనం మన తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ, కరుణతో సేవ చేసినప్పుడు ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ఈద్ మిలాద్-ఉన్-నబీ’ శుభదినం దయ, కరుణలతో పాటు పవిత్ర ప్రవక్త బోధనలను గుర్తు చేస్తుందన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం అందరిలో శాంతి, సద్భావనలను కలిగిస్తుందని బిశ్వ భూషణ్ హరి చందన్ వివరించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
Tags vijayawada
Check Also
ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారం
-తద్వారా వాటి పనితీరు మెరుగుపరుద్దాం -సీఎం ఆశయాలకనుగుణంగా పనిచేయాలి -యూస్ కేసెస్‌ను త్వరితగతిన అమల్లోకి తీసుకొచ్చేలా పనిచేయండి -త్వరలో అందుబాటులోకి …