విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్గా నిమితులైన 2020 ఐఏఎస్బ్యాచ్కు చెందిన అదితి సింగ్ ఐ.ఏ.ఎస్. సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును మార్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించేందుకు నగరానికి చెరుకున్న అదితి సింగ్ సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నివాసంలో కలెక్టర్ డిల్లీరావును కలిసి సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాల పునవ్యవస్తీకరణ అనంతరం ఏర్పాడిన ఎన్టిఆర్ జిల్లా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. రాజదాని నగరం కావడంతో విఐపిలు వివిఐపిలు నగరానికి రాకపోకలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు చేెరువ చేసేందుకు కృషి చేయాలని ముఖ్యంగా ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మిణాలు, జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలను పూర్తి చేయడంలో చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన ఆర్జీలను పరిష్కరించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నూతన సబ్ కలెక్టర్గా బాధ్యలు స్వీకరించిన అదితి సింగ్కు సూచించారు. సబ్ కలెక్టర్గా మంచి గుర్తింపు తెచుకోవాలని ఆమెకు అభినందనలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …