విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి అండగా నిలవడమే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం రూపకల్పన చేసారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ 12వ సచివాలయం పరిధిలోని విజయనగర్ కాలనీ,మసీదు స్ట్రీట్ కొండా చివర ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు. ఏదైనా సాంకేతిక కారణాల వలన ఏదైనా సంక్షేమ పథకాలు అందకపోతే మా దృష్టికి తీసుకువస్తే తక్షణమే తగు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే రాష్ట్రంలో ప్రజలకు అర్హతే ప్రామాణికంగా కులమత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని,ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వారి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ వారి సొంతింటి కలను నిజం చేస్తున్నారు అని అన్నారు. ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న కొండ ప్రాంతంలో నాడు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో నిర్మించిన మెట్లు, డ్రైనేజీ నిర్మాణాలు తప్ప టీడీపీ హయాంలో పట్టించుకోలేదు అని,మరలా నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.గత తెలుగుదేశం ప్రభుత్వం లో అవ్వతాతలు వయస్సు సహకరించకున్న సరే పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ కళ్ళారిగెల తిరిగే పరిస్థితి అని,కానీ నేడు జగనన్న వలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని,గడపగడపకు వస్తున్న వైస్సార్సీపీ నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ వారి మద్దతు తెలపడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు,వైస్సార్సీపీ నాయకులు పమిడిముక్కల రాజు,విజయబాబు,యాసీన్,డేవిడ్ రాజు,బిమిశెట్టి నాని,గణేష్ బాబు తదితరులు పాలొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …