విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ కు చెందిన కాగిత రాజ్ కుమార్ కి వైద్య ఖర్చులు నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ చైర్మన్, నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అందజేశారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయనగర్ కాలనీలో పర్యటించినప్పుడు రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి గురుంచి అవినాష్ కు వివరించగా తక్షణమే స్పందించిన ఆయన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన నిరుపేద కుటంబాలకు దేవినేని నెహ్రు ట్రస్ట్ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijaya
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …