విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆకస్మిక మరణం చెందిన పేద,బడుగు, బలహీన వర్గాల నుండి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ సమాజ్ వాదీ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్దలు, పూజ్యులు ములాయం సింగ్ యాదవ్ గారి చిత్రపటానికి తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ , 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు అన్నే చిట్టిబాబు, రామకోటేశ్వర రావు వైసిపి నాయకులు డేవిడ్ రాజు, బచ్చు మురళి, సొంగా రాజ్ కమల్, చింతగుంట విజయ్, ప్రభు, చెన్ను, చింతా బుచ్చి బాబు, పచ్చిగోళ్ళ రమేష్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …