-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ములాయం తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారని తెలిపారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు, కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలను అందించారని చెప్పారు. చివరి శ్వాస వరకు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. ములాయం మృతితో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.