విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 4వ తేదీ నుండి పదవ తేదీ వరకు మానసిక ఆరోగ్య వారోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా డాక్టర్ అయోధ్య ఆర్కే ,డాక్టర్ మానస కాజా, డాక్టర్ నూరే పవన్ కుమార్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ స్థానిక గాంధీనగర్ సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ నూటికి 25% మంది మానసికమైన సమస్యలు ఇబ్బందులు వ్యాధులతో బాధపడుతున్నారని స్ట్రెస్ ఆధునికత పట్టణీకరణ నైతిక విలువలు తగ్గటం చదువు భారం బ్రతుకు భారం నిరుద్యోగం దారిద్యం కుటుంబ బంధాలు ప్రేమలు తగ్గిపోవడం అనేక మానసిక సమస్యలకు కారణమని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మానస కాజా మాట్లాడుతూ ఇప్పటికీ మన సమాజంలో మానసిక సమస్యలు వ్యాధులు గుర్తుపట్టడమే కానీ అనారోగ్య వ్యాధి ఉందని మనస్సు ఒప్పుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారని డబ్ల్యూ హెచ్ ఓ ప్రకారం ఆరోగ్యం కంటే భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా బాగుపడినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అనే నిర్వచనం అవుతుందని ఈ సంవత్సరం డబ్ల్యు ఎన్ హెచ్ ఎఫ్ నినాదం అందరికీ మానసిక ఆరోగ్యం ప్రపంచ ప్రాధాన్యతగా చేద్దామని అన్నారు డాక్టర్ అయోధ్య ఆర్ కె మాట్లాడుతూ మానసిక జబ్బులతో ముఖ్యంగా భయం ఆందోళన కంగారు దడ వణుకు దిగులు నిరాశ విరక్తి పనులు యందు ఆసక్తిని కోల్పోవడం ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఆత్మహత్య తలంపులు ప్రయత్నాలు ఒంటరిగా ఉండటం తనలో తాను నవ్వడం మాట్లాడుకోవడం ఏడవటం అనుమానాలు భ్రమలు బ్రాంతులు మనుషులు లేకుండానే ఏదో మాట్లాడు మనుషులు కనిపించడం జీవిత భాగస్వామి యొక్క హింసించడం ఇలా అనేక మానసిక వ్యాధి లక్షణాలన్నీ గుర్తించగలగాలని తాగుడికి ఈ వ్యాధులకు బానిస అవడం వృద్ధాప్యంలో మతిమరుపు గుర్తింపుని కోల్పోవడం కూడా మానసిక వ్యాధిని అన్నారు. ఈ వ్యాధులకు మందులు ద్వారా, సైకోథెరపీలు బిహేవియర్, థెరపీ ,షాక్ ట్రీట్మెంట్ ,కౌన్సిలింగ్ సెషన్స్, నిర్వహించడం జరుగుతుందని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి 45 సెకండ్లకి ఒకరు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రతి 10 సెకండ్లకి ఒకరు డెమేన్షియ వ్యాధి బారిన పడుతున్నారని డిప్రెషన్ ఆల్కహాల ఎ డిక్షన్ ప్రపంచంలో గుర్తించబడ్డాయని అన్నారు డాక్టర్ సూర్య పవన్ కుమార్ మాట్లాడుతూ జీర్ణ కోశ సమస్యలు అనేకం మానసికమైన స్ట్రెస్ తో ముడిపడి ఉన్నాయన్నారు. హైపర్ ఎస్డిటి గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్,అనేక జీర్ణ కోసం క్యాన్సర్లకు మానసిక భయాందోళనలతో ముడిపడి ఉన్న జబ్బులుగా ఉదాహరించారు ,ఈ కార్యక్రమానికి సైకాలజిస్టులు శ్రావణ్ కుమారి ,కే లక్ష్మి ,ఎల్ వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …