-బుధవారం నాడు విజేతలకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ప్రదానం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పదో బెటాలియన్ జాతీయ విపత్తుల స్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న సౌత్ మరియు సౌత్ సెంట్రల్ జోన్ యోగా మరియు వన్ మినిట్ డ్రిల్ పోటీల కార్యక్రమాన్ని పదో బెటాలియన్ కమాండెంట్ జాహీద్ ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం, కొండపావులూరు గ్రామంలోగల నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన ఎన్.డి.ఆర్.ఎఫ్. ఒడిస్సా, మహారాష్ట్ర, తమిళనాడులకు చెందిన మూడు, నాలుగు, ఐదు మరియు పదో బెటాలియన్ జవాన్లు ఫ్లాగ్ మార్చ్ చేసి ముఖ్యఅతిథికి సైనిక వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ జాహీద్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ యోగ మరియు వన్ మినిట్ డ్రిల్ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం విపత్తుల సమయంలో జవాన్లలో శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని పెంచడానికి మరియు పోటీ తత్వాన్ని పెంచడానికి ఉపయోగపడతాయన్నారు. వన్ మినిట్ డ్రిల్ పోటీల్లో 11 ఈవెంట్స్ ఉంటాయని ఇందులో వివిధ విపత్తుల సమయంలో ఉపయోగించే పరికరాలపై పోటీ ఉంటుందని పోటీలు నియమ నిబంధనలకు లోబడి జరుగుతాయనన్నారు. అలాగే బుధవారం నిర్వహించే ఈ యోగా పోటీల్లో ఐదు ఈవెంట్స్ అవి 1)యోగాసనా 2) కళాత్మక యోగ 3) కళాత్మక యోగ జంటగా 4) రిథమిక యోగ 5)యోగా నృత్య పోటీ ఉంటాయని తెలిపారు. యోగా మరియు వన్ మినిట్ డ్రిల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు విన్నర్ మరియు రన్నర్స్ కి గోల్డ్ మెడల్స్ మరియు సిల్వర్ మెడల్స్ తో సత్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పదో బెటాలియన్ రెండో కామెండెంట్ నిరంజన్ సింగ్, డిప్యూటీ కామెండెంట్స్ జఫ్రూల్ ఇస్లాం, సుఖీంద్ దత్త, అఖిలేష్ చౌబీ, ఇస్పెక్టర్ గోపాల కృష్ణ, ఎన్.డి.ఆర్.ఎఫ్ అధికారులు, సబార్డినేట్ అధికారులు, జవాన్లు పాల్గొన్నారు.