విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెల్పిన ట్రస్ట్ చైర్మన్,తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.12వ డివిజన్ అయ్యప్ప నగర్ లో పక్షవాతంతో బాధపడుతున్న మిండ నాగేశ్వరరావు కి ట్రస్ట్ ద్వారా అవినాష్ రూ.10,000/- విలువ చేసే వీల్ చైర్ అందజేశారు. అంతేకాకుండా భవిష్యత్ లో వారికీ ఏ అవసరం ఉన్న ట్రస్ట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని అవినాష్ భరోసా ఇచ్చారు.రాబోయే రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరుపుతామని,పూర్తి సహాయసహకారాలు ఉంటాయని అవినాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వై ఎస్ ఆర్ సి పి నాయకులు మాగంటి నవీన్ కుమార్, మహమ్మద్ రిజ్వాన్, ధనేకుల రామ కాళేశ్వర రావు, అత్తలూరి బ్రహ్మయ్య, మహమ్మద్ కలీం, శేషారెడ్డి , అబ్దుల్ రహీం, ఎండి పర్వేజ్, త్రిపురనేని చందు, మరియు అయ్యప్ప నగర్ అభివృద్ధి సంఘం అధ్యక్షులు గొల్లపల్లి వెంకటేశ్వరరావు, అనుమోలు గిరి పాలొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …