Breaking News

జగనన్న పాలనలో గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-32వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పథకాలపై ప్రజాచైతన్యం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 32 వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. లోటస్ సెక్టార్ – 2, 3 లలో విస్తృతంగా పర్యటించి.. 148 గడపలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా కాకుండా పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మల్లాది విష్ణు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ నగదును నేరుగా లబ్ధిదారులలో ఖాతాలలో జమ చేయడం జరుగుతోందన్నారు. కనుకనే కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా రాష్ట్రంలో ప్రతిఒక్కరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అది చూసి ఓర్వలేక టీడీపీ, బీజేపీ, జనసేన ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే సమస్యలపై ఆరా తీసి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

నాడు-నేడుతో లోటస్ రూపురేఖలే మారిపోయాయి
లోటస్ సెక్టార్ లోకి అడుగుపెట్టే హక్కు ఒక్క వైఎస్సార్ సీపీకి మాత్రమే ఉందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు ఈ ప్రాంతానికి వచ్చే వారని.. ఇప్పుడు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించడం కోసం ప్రతి ఇంటికీ వస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ ప్రాంతం రూపురేఖలు మార్చడం జరిగిందని వివరించారు. ఒక్క లోటస్ ప్రాంతంలోనే రూ. 2.12 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చినట్లు వెల్లడించారు. అలాగే ఈ ప్రాంతవాసులకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం రూ. 80 లక్షల వ్యయంతో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఇటీవల ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో ఇదేవిధంగా కొనసాగుతుందని.. ఒక్కో సచివాలయానికి కేటాయించిన రూ. 20 లక్షల నిధులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పరిపాలన వికేంద్రీకరణ మా విధానం
పాలనాపరంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాల ప్రజల నుంచి పెద్దఎత్తున మద్ధతు లభిస్తున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజనతో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాలు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, మూడు రాజధానుల నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా మూడు స్థాయిలలోనూ పాలన సులభతరం అవుతుందని తెలియజేశారు. కానీ చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రజలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కేంద్రీకరణ వల్ల రాష్ట్రంలోని మిగతా జిల్లాలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని గుర్తుచేశారు. వికేంద్రీకరణ జరగకపోతే మరో వేర్పాటు ఉద్యమం మొదలయ్యే ప్రమాదం ఉందని.. కనుక మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, శ్యామ్, నాడార్స్ శ్రీను, పేర్ల శ్రీనివాస్, ఎస్.విజయ్ కుమార్, నాళం సురేష్, సువర్ణ రాజు, ఆదిరెడ్డి, భోగాది మురళి, మేడేపల్లి ఝాన్సీ, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *