-మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 55.95 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కండ్రిక డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ కు రూ. 19.95 లక్షల నిధులతో ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు రూ. 36 లక్షల నిధులతో అజిత్ సింగ్ నగర్లోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఆవరణలో అంతర్గత రహదారులు మరియు రోడ్డు లెవలింగ్ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి బుధవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా కేవలం శంకుస్థాపనలకు పరిమితం కాకుండా వెనువెంటనే పనులు ప్రారంభించి పూర్తిచేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి వారి సౌకర్యాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు వివరించారు. ఒక ప్రణాళిక ప్రకారం చిట్టచివరి కాలనీ వరకు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి పరుస్తున్నట్లు పేర్కొన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఈ నెలాఖరు కల్లా మధురానగర్ లో 24*7 తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ(అమృత్ ప్రాజెక్ట్స్) వెంకటేశ్వరరెడ్డి, డీఈ రవికుమార్, వైసీపీ కార్పొరేటర్లు యరగొర్ల తిరుపతమ్మ, ఎండి షాహినా సుల్తానా, నాయకులు యరగొర్ల శ్రీరాములు, హఫీజుల్లా, బెవర నారాయణ, బత్తుల దుర్గారావు, అక్తిశెట్టి నారాయణ, మేడా రమేష్, ఎస్.కె.ఇస్మాయిల్, బలగా శ్రీను, ఎస్.డి.బాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.