విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22వ తేదిన స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక న్యాయ సేవా సదస్సును విజయవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ అన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే న్యాయ సేవా సదస్సుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై బుధవారం నగరంలోని పింగళివెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్,లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఏ పద్మ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 22వ తేదిన స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే న్యాయ సేవా సదస్సులో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, మాదక ద్రవ్యాల నిరోధకం వంటి పలు అంశాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై చర్చించడం జరుగుతుందన్నారు. న్యాయ సేవా సదస్సులో సంక్షేమ చట్టాలు, పథకాల పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అర్హులైన లబ్దిదారులకు పథకాల ఫలాలను అందేలా చూడటం సంక్షేమ పథకాలపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో పాటు తగిన న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిభిరంలో రెవెన్యూ, పోలీస్, డిఆర్‌డిఏ, స్త్రీ శిశు సంక్షేమం, విభిన్నప్రతిభావంతుల సంక్షేమం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మైనార్టి సంక్షేమం, విద్య, వైద్య ఆరోగ్య, స్వచ్చంద సంస్థలు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు కర్రపత్రాలు, బ్రోచర్లను సిద్దం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఏ పద్మ మాట్లాడుతూ సదస్సులో మాదకద్రవ్యాల దుర్వినియోగం, మాదకద్రవ్యాల నిర్మూలన బాధితులకు చట్టపరమైన సేవలపై చర్చించడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించే సంక్షేమ ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఏ పద్మ అన్నారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, డిసిపి మేరి ప్రశాంతి, డిఇవో సివి రేణుక, విభిన్నప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి రామకుమార్, నగరపాలక సంస్థ అడిషనల్ కమీషనర్ శ్యామల, డిఆర్‌డిఏ పిడి ఎన్. కిరణ్‌కుమార్, ఐసిడిసి పిడి జి. ఉమాదేవి, బిసి వెల్ఫెర్ డిప్యూటి డైరెక్టర్ లక్ష్మిదుర్గ తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …