విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
APSRTC ఈ సంవత్సరం దసరా సందర్భంగా రికార్డు ఆదాయం సాధించింది. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 10 వ తేదీ వరకు మొత్తం ఆదాయం రూ. 271 కోట్లు ఆర్జించి రికార్డు సృష్టించింది. కోవిడ్ తర్వాత ప్రయాణికులు ఈ దసరా కు అధిక సంఖ్య లో సొంత ఊళ్లకు రావడం జరిగింది. దీనిని ఆర్టీసి అనుకూలంగా మలచుకొని ముందస్తు ప్రణాళిక తో బస్సులను, సిబ్బందిని సమాయత్తం చేసి ప్రయాణికుల అవసారాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపింది. మునుపెన్నడూ లేని విధంగా దసరా కు అత్యధికంగా అనగా 4626 ప్రత్యేక బస్సులు కేవలం సాధారణ ఛార్జీలతో నడిపి రూ.11.50 కోట్లు ఆదాయం పొందింది( గత సంవత్సరం 2437 బస్సులతో రూ. 5.49 కోట్లు ఆదాయం సమకూరింది). పండుగ తరువాత తిరుగు ప్రయాణానికి ప్రజలకు అత్యధిక బస్సులు నడిపి కేవలం 10 వ తేదీ ఒక్క రోజున 22 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించడం ఒక రికార్డుగా నిలిచింది. ఆర్టీసి సాధారణ ఛార్జీలు వసూలు చేయడం తమకు ఎంతో ఉపశమనం కలిగించిందని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేసారు. పౌర్ణమి సందర్భంగా ఈ నెల 9 వ తేదీ గిరి ప్రదక్షిణం మరియు దర్శనం కొరకు తిరువన్నామలై (అరుణాచలం) కు కడప, నెల్లూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మరియు నరసరావుపేట నుండి 11 బస్సులు నడిపి రూ.5.60 లక్షల అదనపు ఆదాయం ఆర్టీసి ఆర్జించగలిగింది.
ప్రయోగాత్మకంగా ఒక బస్సుతో ప్రారంభించి మొదటి నెలలోనే 11 బస్సులు నడపడం జరిగింది . ఇకనుంచి ప్రతినెలా పౌర్ణమి కి అరుణాచలం/ తిరువన్నామలై కి బస్సులు ఏర్పాటు చేస్తాము. డిమాండు ని బట్టి ఇతర ప్రదేశముల నుండి కూడా తిరువన్నామలై కు బస్సులు నడపబడును. ఇదే ఉత్సాహంతో రాబోయే కార్తీక మాసం మరియు శబరిమల పుణ్య క్షేత్ర దర్శనాలకు అత్యధిక బస్సులు నడిపి ఈ అవకాశాన్ని కూడా అంది పుచ్చుకోవడానికి ఆర్టీసి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …