విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గరంలో కృష్ణానది, బందరు, ఏలూరు, రైవస్ కాల్వల్లో వ్యర్ధాలను వేయొద్దని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, IAS అన్నారు. ‘మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్’లో భాగంగా ఈ రోజు ఏలూరు, బందర్, రైవస్ కాలువల వద్ద నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. రైవస్ కాలువ వెంబడి 200 సచివాలయం, గులబితోట నుండి మాచవరం వరకు, ఏలూరు కాలువ వెంబడి వెహికాల్ డిపో నుండి మీసాల రాజారావు బ్రిడ్జి వరకు, బందర్ కాలువ వెంబడి 61 వ సచివాలయం, అంబేద్కర్ నగర్ వరకు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది రోడ్డుపక్కన వ్యాపారం నిర్వహింస్తున్న వారికి అవగాహన కల్పించి కాల్వల్లో వ్యర్ధాలు వేయుద్దని వాటి వలన నీరు కలుషితం అవుతుందని వివరించారు. ఘన/ద్రవ వ్యర్థాల నిర్వహణ, అందించిన వివిధ డబ్బాలలో వ్యర్థాలను వేరు చేయడం మరియు ప్రధానంగా బల్క్ వేస్ట్ డంపర్‌లను గుర్తించడం మరియు వాటిని స్థిరమైన మార్గాలతో మార్గనిర్దేశం చేయడంపై వ్యాపారులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …