విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు), ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్(ఎయంసియు) నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపు పూర్తి చేశామని, నిర్మాణాలను త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ఏపి డైరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపి అమూల్ ప్రోజెక్టు స్పెషల్ ఆఫీసర్ బాబు ఏ కు వివరించారు. ఏపిడిడిసిఎఫ్‌యం డైరెక్టర్ బాబు ఏ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్‌లు వీడియెకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 112 బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు)కు పూర్తి స్థాయిలో భూములు కేటాయింపు చేశామని, అదేవిధంగా 262 ఎయంసియులకు గాను 256 కేంద్రాలకు భూ కేటాయింపు పూర్తి చేశామన్నారు.మర్టిపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ గౌడౌన్స్ నిర్మాణాలకు సంబంధించి మూడవ దశ పనులకు భూ సేకరణ వేగవంతం చేస్తున్నామని వీటిలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 21 గౌడౌన్‌ల నిర్మాణాలకు గాను 8 గౌడౌన్‌లకు భూముల కేటాయింపు పూర్తి చేశామని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
Tags vijayawada
Check Also
రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …