Breaking News

సీఎం వైఎస్ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-32వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమ‌ని.. లోటస్ ప్రాంతమే ఇందుకు చక్కని ఉదాహరణగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 32 వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధి లోటస్ సెక్టార్ – 2 లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం పండగ వాతావరణంలో సందడిగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్ తో కలిసి పర్యటించిన ఎమ్మెల్యేకు ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. తమ ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్యేని ప్రజలు సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. తమ అభిమాన నేతకు పుస్తకాలను బహుకరించారు. ఎమ్మెల్యే చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగానే అతి తక్కువ సమయంలో లోటస్ సెక్టార్ మోడల్ ప్రాంతంగా రూపుదిద్దుకుందని స్థానికులు తెలిపారు. 2019 కి ముందు లోటస్ ప్రాంతాన్ని ఊహించుకోలేమన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణుకి ప్రాంత ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. వీలైనంత త్వరలో ఈ ప్రాంతంలో ఓటర్ల నమోదు డ్రైవ్ ను నిర్వహిస్తామని తెలియజేశారు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేత
కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల కోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విన్నవించిన పలువురికి ఎమ్మెల్యే చొరవతో ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. పర్యటనలో భాగంగా దరఖాస్తుదారులకు మల్లాది విష్ణు చేతులమీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. జగనన్న సంక్షేమ రాజ్యంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రయోజనం చేకూరాలన్న తపన, తాపత్రయంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమం మొదలు సర్టిఫికెట్ల జారీవరకు నిలువునా దోచుకుంటే.. జగనన్న ప్రభుత్వం పారదర్శకంగా గడప గడపకు వెళ్లి అర్హులను వెతికి లబ్ధి చేకూరుస్తోందని వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రజల మనోభావాలను ప్రతిపక్షాలు గౌరవించాలి
పాలనను ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను చూసి దేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు స్ఫూర్తిని పొందుతున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు తెలిపారు. వికేంద్రీకరణనే ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు మూడు రాజధానులకు, పరిపాలనా వికేంద్రీకరణపై సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు. కానీ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడాన్ని ఓర్వలేక ఉత్తరాంధ్రపై ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయారని మల్లాది విష్ణు విమర్శించారు. అమరావతిలో ఎక్కడ చూసిన తవ్వి వదిలేసిన పునాదులే దర్శనమిస్తుంటే.. సగానికి పైగా రాజధాని నిర్మాణం పూర్తిచేశామని అచ్చెన్నాయుడు చెప్పడం ఆయన అజ్ఞానమన్నారు. రాజధాని అంటే ప్రజలు అని, అంతేకానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని చెప్పారు. తెలుగుదేశం హయాంలో అమరావతి నిర్మాణానికి నిజంగా అడుగులు పడి ఉంటే.. 23 సీట్లు ఎందుకు వస్తాయో అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఓటు, సీటు లేని పార్టీలు కూడా తమపై విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు ఉత్తరాంధ్రపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. తన ఓటమికి విశాఖలోనే బీజం పడటంతో.. ఆ ప్రాంతంపై పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు ధోరణిలో ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉత్తరాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న విశాఖ గర్జనను పవన్ కళ్యాణ్ గౌరవించాలని కోరారు. అంతేగాని ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా అదే రోజు ఆ ప్రాంతంలో సమావేశాలు నిర్వహిస్తే.. ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, వైసీపీ కార్పొరేటర్లు కొంగితల లక్ష్మీపతి, జానారెడ్డి, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు ఆత్మకూరు సురేష్, ఉమ్మడి వెంకట్రావు, బంకా భాస్కర్, జి.వెంకటేశ్వరరెడ్డి, కొండపల్లి మురళి, చంద్రమోహన్, సాంబశివరావు, నాడార్స్ శ్రీను, మల్లాది శ్రీనివాస్, జి.శ్యామ్, పేరం త్రివేణి రెడ్డి, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *