Breaking News

రెండు రాష్ట్రాల్లో వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 80 లక్షల మంది వడ్డెర్లు ఉన్నారని 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో 8 మంది ఎమ్మెల్యేలు 4 ఎంపీలని చట్టసభల్లో తీసుకురావడానికి అన్ని రాజకీయ పార్టీలు చట్టసభలలోకి తీసుకురావడానికి వడ్డెర్లకు అవకాశం కల్పించాలని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ అధ్యక్షులు సంపంగి గోవర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షులు చల్ల పుల్లారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఎస్టీ సాధన కావాలని ఇతర రాష్ట్రాల్లో వడ్డెళ్లను ఎస్సీ ఎస్టీ గా గుర్తించారని అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీ సాధన కోసం డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి ఉద్యమాన్ని చేస్తామని జాతీయ వడ్డెర హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన యాత్ర ద్వారా రెండు రాష్ట్రాల్లో చైతన్యం తీసుకుని వస్తామని తెలియజేశారు. అనంతరం విజయవాడ నగర అధ్యక్షులు కృష్ణా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తులనాగేశ్వర రావుమాట్లాడుతూ మా వడ్డెర్లు, కొండలు, క్వారీలను కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారికి క్వారీ కాంట్రాక్టు ఇప్పించి 25% రాయితీ ఇవ్వాలని కోరారు. నేషనల్ వడ్డెర సంఘం ఉపాధ్యక్షులు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దండుగల అశోక్ బాబు, మైనింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ బత్తుల రామారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్

-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *