Breaking News

న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలి : లియాఫీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (లియాఫీ) జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని బీసెంట్ రోడ్డు చివరన వున్న ఎల్.ఐ.సీ బ్రాంచ్ నందు ఎల్ఐసి ఏజెంట్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ప్రెసిడెంట్ కె.వెంకటేశ్వర్లు,  బ్రాంచ్ సెక్రటరీ ఎస్ కె..మీరా సాహెబ్, బ్రాంచ్ కోశాధికారి కే.పిచ్చయ్య, బ్రాంచ్ నాయకులు ఏజెంట్లను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్స్ పాలసీలపై బోనస్ ని పెంచాలి. పాలసీలపై లోన్ వడ్డీరేట్లు తగ్గించాలి. కస్టమర్ కు సమర్థవంతమైన సేవలు అందించాలి. 5 ఏళ్లకు పైబడిన ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించాలి. ఏజెంట్స్ సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. అన్ని శాఖల్లో పౌరుల చాప్టర్ ప్రదర్శించాలి. ఎల్.ఐ.సీలో కస్టమర్ కు పాలసీ సర్వీసింగ్ రేటింగ్ మేము డిమాండ్  చేస్తున్నాము. ఎల్.ఐ.సీలో కె.వై.సీ ఒకేసారి సమర్పణ కోరుతున్నాము. పోస్టల్ ప్రింటెడ్ బాండ్స్ ఆపాలి. ఏజెంట్లకు అడ్వాన్స్ పై వడ్డీ రేట్లు తగ్గించాలి. క్లియా ప్రయోజనాలు పెంచాలి.  డైరెక్ట్ ఏజెంట్లకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలి. ఏజెంట్ పిల్లలకు విద్యా రుణం ఇవ్వాలి.  గ్రాడ్యుటి పెంచాలి.  గ్రాడ్యుటీ లెక్కింపు విధానం మార్చాలి. ఐ.ఆర్.డీ.ఏ ప్రకారం ఏజెంట్ల కమిషన్ యొక్క పునర్నిర్మాణం జరగాలి.  ప్రతి ఏజెంట్ కు గ్రూప్ మెడి క్లెయిమ్ పెంచాలి. ధ్రువీకరించబడిన ఏజెంట్లు అందరికీ మెడి క్లెయిమ్ ఇవ్వాలి. కాంట్రిబ్యూటింగ్ పెన్షన్స్ స్కీమ్ కావాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి. టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలి. టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క షరతులు విడుదల చేయాలి. పాలసీలకు జీఎస్టీని తొలగించాలి. మెడి క్లెయిమ్ ను డీ సెంట్రలైజేషన్ చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం 43వ రోజుకు చేరుకుందన్నారు. ఈ కార్యక్రమంలోపెద్ద ఎత్తున లియాఫీ జేఏసీ నాయకులు, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఏజెంట్లు పాల్గొని పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని నిరసన తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *