విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్బంగా విజయవాడ నగరపాలక సంస్థ 3 సర్కిల్స్ లో గల నగరపాలక సంస్థ స్కూల్స్ నందు అంగన్ వాడీ కేంద్రములలో మరియు నైట్ షెల్టర్స్ లలో ప్రాజెక్ట్ ఆఫీసర్ యు.సి.డి శకుంతల గారి ఆద్వర్యంలో అవగాహన్ కార్యక్రమము మరియు ర్యాలీలు నిర్వహించడమైనది. మన రాష్ట్ర ప్రభుత్వం UNICEF మరియు మిషన్ డైరెక్టరు మెప్మా వారి ఆదేశముల మేరకు 15.10.2022 న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవము నిర్వహించడం జరిగిందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి మరియు జివించడాకి ముందుగా మనమంతా భోజనం చేసేటప్పుడు చేతులు పరిశుభ్రoగా కడగాడం వలన ఎటువంటి అనారోగ్యనికి గురిఅవ్వకుండా ఉంటాము అని, మన ఆరోగ్యం మన చేతులోనే, ఆరోగ్యమే మహాభాగ్యం అంటు నినాదాలతో ర్యాలీలు నిర్వహించినారు. కార్యాక్రమములో సంబంధిత కార్పొరేటర్లు, మెడికల్ ఆఫీసర్లు వారి సిబ్బంది, స్కూల్ హెడ్ మాస్టారు వారి సిబ్బంది, యు.సి.డి సిబ్బంది, అంగన్ వాడీ కార్యకర్తలు, మరియు SHG,SLF, TLF మెంబర్స్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …