విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్ సర్కిల్ లో ధర్నా చౌక్ నందు 15వ రోజు సత్యాగ్రహ దీక్షలు, నిరవదిక దీక్షలు చేస్తున్నారు. రాయదుర్గం నుండి సుమారు 200 మంది, వివిధ జిల్లాలు, వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో వాల్మీకి సంఘ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్వీనర్ బి ఈశ్వరయ్య మాట్లాడుతూ గతంలో వాల్మీకులను గిరిజనులు గానే పరిగణించి ఎస్టి జాబితాలోనే చూడబడే వారిని, అయితే ప్రాంతీయ వ్యత్యాసాలు సృష్టించి వాల్మీకి లేదా బోయలను అన్యాయానికి గురి చేశారని అన్నారు. 2017 అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీని మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ నివేదికలను రాష్ట్ర మంత్రి మండలి లోతీర్మానించి రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానమును ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వ చర్యలకు కేంద్ర ప్రభుత్వానికి పంపినారని తెలిపి ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఐదు సంవత్సరాల నుండి అవసరమైన చర్యలు చేపట్టకుండా తాత్శ్చర్యం చేయుచున్నారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాల్మీకిలను ఎస్టీ జాబితాలోనికి చేర్చాలని రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో 15వ రోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష, సత్యాగ్రహ దీక్షలు చేయుచున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019లో కర్నూలు బహిరంగ సభలో వాల్మీకి లేదా బోయల చిరకాల వాంఛను అర్థం చేసుకున్నానని వారి న్యాయమైన కోర్కెను తీర్చేదినని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వాల్మీకి బోయల శాంతియుత నిహార దీక్ష లోడిమాండ్ చేయుచున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున ప్రతినిధి లక్ష్మి ప్రియ, అరుణ, వాల్మీకి జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ యం.జగదీశ్వరరావు, బొప్పవరపు భానుప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …