విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) లేఖలకు కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలం గా స్పందించినట్లు కేశినేని భవన్ నుండి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. భారత మాల కార్యక్రమంలో భాగంగా నాగపూర్ నుండి విజయవాడ వరకు వస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకు విజయవాడ రూరల్ మండలం పైడూరు పాడు గ్రామం,జి కొండూరు మండలం కవులూరు గ్రామం వద్ద హైవే కు రెండు వైపులా సర్వీస్ రోడ్డును 3.2 మీటర్ల నుండి 7 మీటర్లకు పెంచి, ప్రజల భద్రత దృష్యా గ్రీన్ ఫీల్డ్ హైవే వెళుతున్న గ్రామాల వద్ద అండర్ పాస్ లు ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వలన బుడమేరుకు వరద వచ్చి నప్పుడు జి.కొండూరు మండలంలోని వెలగలేరు కవులూరు గ్రామ వ్యవసాయ పంటలు దెబ్బతిన కుండా పరిరక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి లేఖ ద్వారా ఎంపి కేశినేని శ్రీనివాస్(నాని) విన్నవించారు. ఎంపి శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) లేఖకు సానుకూలంగా స్పందించి ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తెలిపినట్లు ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …