రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 24 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏ డి సి పి ఎం సత్య వేణి, ఎస్సీ జి పాండురంగారావు, సిపి సూరజ్ కుమార్ ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.అనంతరం స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పరిష్కారము చేసిన తదుపరి వాటి వివరాలు సెల్ఫి తీసుకుని ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. క్షేత్ర స్థాయి లో చేపట్టవలసిన ఇంజనీరింగ్ తదితర పనుల వివరాలు సేకరించిన వాటి వివరాలు ఎప్పటి కప్పుడు డేటా ఎంట్రీ ఏ రోజుకి ఆరోజు ఆ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రాధాన్యత పనులు, పన్నుల వసూళ్లు, చెత్త పన్ను వసూళ్లు కోసం ప్రతీ సచివాలయం సిబ్బందికి 100 ఇళ్లను ట్యాగ్ చేశామని, సంబందించిన సిబ్బంది తో శనివారం సమావేశం అనంతరం సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. డోర్ టూ డోర్ చెత్త సేకరణ , యూజర్ చార్జీలు వసూలు కోసం శ్రద్ద తీసుకోవాలన్నారు. ఇప్పుడు మానవ వనరులు, వాహనాలు సమకూర్చు కోవడం పెరగడం వల్ల ప్రతినెలా సుమారు రూ.45 లక్షల వరకు అదనపు భారం పడుతోందని ఆయన అన్నారు. పౌర సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవడం జరిగిందని, అందుకు అనుగుణంగా ప్రజలు ఆ మొత్తం చెల్లించేలా సంబందించిన సిబ్బంది పనిచేయాలన్నారు.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …