Breaking News

స్పందనలో 91 ఆర్జీల స్వీకరణ

-గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ఆర్జీలకు నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కరం జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్‌, మండల, గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహిస్తు సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలోనే కాకుండా గ్రామ వార్డు సచివాలయ స్థాయిలోనూ, 1902 కాల్‌ సెంటర్‌, మొబైల్‌ యాప్‌ వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా కూడా అర్జీలు వస్తుంటాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు గడువులోగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. పరిష్కారం కాని వాటిని తగిన కారణాలను అర్జీదారునికి తెలపాలన్నారు. ప్రతి అర్జీదానికి తమ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం కలిగించేలా వారు చెప్పే సమస్యలను సావదానంగా విని పరిష్కరిస్తే వ్యవస్థపై నమ్మకం కలుగుతుందన్నారు. ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలతో జిల్లా కేంద్రానికి అర్జీలు ఇచ్చేందుకు వస్తుంటారని వారిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా వారి అర్జీలను సానుకూల దృక్పథంతో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి మంగళవారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి గురువారం స్పందన అర్జీల పట్ల అధిక ప్రాధాన్యత నిచ్చి సమీక్షించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం అవుతున్న అర్జీల విషయంలో జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించి అర్జీల పరిష్కారంలో నాణ్యతను గమనించి క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు చేయాలన్నారు. అర్జీదారులు ఏదైనా పథకానికి అర్హులు కాకపోతే వారికి ఎందువల్ల వర్తించదో స్పష్టంగా అర్థమయ్యే రీతిలో తెలియపరచాలన్నారు. న్యాయస్థానాలకు సంబంధించిన కేసుల పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగిన పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
స్పందనలో ప్రధాన ఆర్జీలు :`
చిట్యాల గ్రామానికి చెందిన రెడ్డి మల్ల మంగమ్మ అర్జీఇస్తూ తన కుమార్తె తన బాగోలు చూడకుండా నిర్లక్ష్యం చేస్తుందని తన కుమార్తె పేరుపై వ్రాసిన భూమికి సంబంధించిన పట్టాదారు పాస్పోసుకు టైటిల్‌ డీడ్లను రద్దుచేసి తనకు న్యాయం చేయాలని అర్జీ సమర్పించారు.
వత్సవాయి మండలం మాచినేని పాలెం గ్రామనికి చెందిన దీరవతు శ్రీను అర్జీ సమర్పిస్తూ విభిన్నప్రతిభావంతుల పెన్షన్‌కు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తాను గతంలో ధరఖాస్తు చేసుకున్నప్పటికి నేటి వరకు ఎటువంటి స్పందన లేకపోయిందని తనకు విభిన్నప్రతిభావంతుల పెన్షన్‌ మంజూరు చేయాలని కోరారు.
విజయవాడ సింగ్‌నగర్‌ కు చెందిన దాసరి తారాబాయి ఆర్జీ ఇస్తూ తనకు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికేట్‌ ఇప్పించాలని తమ ఆధారాలను అర్హతను పరిశీలించి ఫ్యామిలీ సర్టిఫికెట్‌ ఇప్పించాలని కోరారు.
ఎ కొండూరు మండలం రామచంద్రపురంగ్రామనికి చెందిన పంబి ఉపారాణి ఆర్జీ ఇస్తూ మండలంలోని కృష్ణరావు పాలెంలో ఉన్నటివంటి తన గృహాన్ని అద్దెకు ఇవ్వడం జరిగిందని కొందరి వ్యక్తులు అద్దెఉన్నవారిని ఇబ్బందులుపెడుతూ తన భర్త బాకీ ఉన్నరనే నేపంతో గొడవలు పెడుతున్నారని దీనిపై విచారణ జరిపించాలని ఉషారాణి కోరారు. స్పందనలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, ట్రైని డిప్యూటి కలెక్టర్లు ఎస్‌ రామలక్ష్మి, ఖతీఫ్‌ కౌసర్‌ బానో, డ్వామా పిడి జె.సునీత, డిఆర్‌డిఏ పిడి కిరణ్‌కుమార్‌, డిఇవో సివి రేణుక, హౌసింగ్‌పిడి శ్రీదేవి, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, జిఎస్‌డబ్ల్యుఎస్‌ జిల్లా అధికారి కె. అనూరాధ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *