Breaking News

స్పందన కార్యక్రమం ద్వారా 15 అర్జీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమం ద్వారా 15 అర్జీలు స్వీకరించిన్నట్లు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ తెలిపారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 15 అర్జీలు నమోదు అయ్యాయని వీటిని గడువులోగాపరిష్కరించాలని సంబంధింత అధికారులను ఆదేశించిన్నట్లు సబ్‌ కలెక్టర్‌ వివరించారు. అర్జీలలో ప్రధానంగా భూ సమస్యలు రెవెన్యూ బ్యాంక్‌ లావాదేవీలు ఉన్నాయని సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ తెలిపారు.
స్పందనలో స్వీకరించిన ముఖ్యమైన అర్జీలలో విజయవాడ నగర్‌ పరిధిలో రాణిగారి తోట బాపనయ్య నగర్‌లో నివసిస్తున్న సజ్జల మాలతి నివాసం ఉంటున్న గృహానికి సరిహుద్దులుగా ఇంటి ముందు రోడ్డు ఇంటి వెనకవైపు ఇల్లు ఉండగా ఇల్లు ఉన్న చోట రోడ్డు రోడ్డు ఉన్న చోట ఇల్లు ఉన్నట్లుగా ఇంటి దస్తావేజుల్లో వ్రాసి ఉండటాన్ని తన తల్లి గమనించలేకపోయారని సజ్జల మాలతి తరపున తన కుమారుడు వెంకటరమణ సబ్‌ కలెక్టర్‌కు అర్జీ ఇస్తూ ఇంటి దస్తావేజేజులలో సరిహద్దు రాతలను సరిచేసి ఇవ్వాల్సిందిగా కోరారు.
అగ్రిగోల్డ్‌కు 2012లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వారికి ప్రభుత్వం వారు అందించిన సహాయమునకు సంబంధించి సొమ్ము తనకు అందలేదని తనకు ఎటువంటి ఆధారం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని విజయవాడ నగరంలో ఒకరి ఇంటిలో తలదాచుకుంటున్న ఎస్‌ నాగమాణిక్యం సబ్‌ కలెక్టర్‌కు విన్నవించారు.
మొగల్రాజపురానికి చెందిన కొలకలూరి జెస్సీ జాస్మిన్‌ సబ్‌ కలెక్టర్‌కు అర్జీ ఇస్తూ సహచర ఉద్యోగికి హామి ఇచ్చిన కారణంగా తన జీవితంలో ప్రతి నెల బ్యాంకు ఈఎంఐ తన జీవితంలో చెల్లించవలసి వస్తుందని తన సహచార ఉద్యోగిని పిలిపించి న్యాయం చేయాలని కోరారు.
పెనమలూరు మండలం కామయ్య తోటకు చెందిన జోసెఫ్‌ ఫ్రింక్లిన్‌ సబ్‌ కలెక్టర్‌ అర్జిస్తూ తనపై మిస్సింగ్‌ ఫిర్యాదు ఇ్వడం వలన తనకు సర్వీస్‌ పెన్షన్‌ అగినదని జనవరి 22లో జీవించి ఉన్నట్లు లైఫ్‌ దృవపత్ర సమర్పణ కూడా చేయడం జరిగిందని అయినప్పటికి పెన్షన్‌ రావడంలేదని కోరారు.
స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన డివిజన్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *