విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు-నేడు పనులలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు పనులు వేగవంతానికి మండల ఎడ్యుకేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నాడు-నేడు పనుల ప్రగతిపై విద్యా శాఖాధికారులతో కలెక్టర్ ఎస్ డిల్లీరావు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెర్ప్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు నాడు`నేడు పనులపై పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. మండల ఎడ్యుకేషన్ అధికారులతో సమన్వయంగా ఉండి పనుల వేగవంతానికి కృషి చేయాలన్నారు. నాడు`నేడు పనులలో జిల్లాలను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలన్నారు. సెర్ప్ విభాగ అసిస్టెంట్ ప్రాజక్టు మేనేజర్లను నాడు`నేడు పనులపై మండల విద్యా శాఖ అధికారులతో సమన్వయం చేసుకునేలా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. దీనిలో భాగంగా అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు టాయిలెంట్ మెయింట్‌నెన్స్, స్కూల్ మెయింట్‌నెన్స్, మిడ్‌డే మీల్ మెయింట్‌నెన్స్, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక తో పాటు నాడు`నేడు పనులపై అవగాహన కలిగివుండి నిర్వహణకు సహకరించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. సమావేశంలో డిఇవో సివి రేణుక, డిఆర్‌డిఏ పిడి కిరణ్‌కుమార్, జిఎస్‌డబ్ల్యుఎస్ జిల్లా అధికారి కె. అనూరాధ, మండల ఎడ్యుకేషన్ అధికారులు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు ఉన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …