Breaking News

తెలుగుదేశం రౌడిరాజ్యానికి ముగింపు పలికిన జగనన్న: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన తర్వాత అప్పటి పరిస్థితులు పొత్తులు లో భాగంగా ప్రజలు టీడీపీ కి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాల్ మనీ దందాలు, కబ్జాలు అడ్డగోలుగా చేసి ఎంతో మంది మహిళల ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ అధికారం కోలుపోయింది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్ 27వ సచివాలయం ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే పేదల బ్రతుకుల్లో వెలుగులు వచ్చాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నేరుగా చిట్ట చివరి ఇంటి వద్దకు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని కొనియాడారు. ప్రజలు ఎంత ఆనంధంగా ఉన్నారో తెలియాలంటే గద్దె రామ్మోహన్ ప్రజల్లో తిరిగితే తెలుస్తోంది కానీ ఎక్కడినుంచో నాయకులని తీసుకువచ్చి మాట్లాడించి పైశాచిక ఆనందం పొడకూడదు అని ఎద్దేవా చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో పెన్షన్ కోసం అవ్వాతాతలు కార్యాలయలు చుట్టూ కాళ్లురిగెల తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ప్రజల వద్దకే పరిపాలనను తీసుకువచ్చిన మన్నస్సున్న ముఖ్యమంత్రి జగన్ అని అవినాష్ అన్నారు. ఇన్నిరోజులు గద్దె రామ్మోహన్ నియోజకవర్గన్ని గాలికొదిలేసి గుర్తు వచ్చినప్పుడు బయటకు వచ్చి పచ్చ ముఠాని తీసుకువచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ జనాన్ని మభ్యపెడుతూ, వైసీపీ కార్యకర్తలను రెచ్చెగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అవినాష్ అన్నారు. ఒక సారి జనాన్ని మభ్యపెట్టి రాష్ట్రం అంతా చి కొట్టించుకున్నారు అయినా బుద్దిరాలేదు అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ముగిసింది అని, మీరు నడిపిన కాల మని రాకెట్ ని మరిచిపోయారా అవినాష్ ఎద్దేవా చేశారు. ఇన్నిరోజులు తన షో రాజకీయాలు, డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టారాని కానీ ఇప్పుడు ప్రజలకు ఆయన నిజ స్వరూపం అర్థం అయ్యేసరికి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు. గద్దె రామ్మోహన్ కి నియోజకవర్గం మీద అంత ప్రేమ ఉంటే శాసనసభ్యునిగా ఉండి నియోజకవర్గానికి ఏ అభిరుద్ది చేసారో వాళ్ల నాయకులను పిలిపించి చేపించాలి కానీ ప్రజలకు ఉపయోగం లేని పిచ్చి పిచ్చి మాటలు కాదు అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అభిరుద్దిని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక వాళ్లకి ఎం మాట్లాడాలో తెలియక అవివేకంతో తెలుగుదేశం పార్టీ వారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ వారి ఉనికి కాపాడుకుంటున్నారు అని అవినాష్ అన్నారు. రాన్నున్న ఎలక్షన్ లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతుంది అని తెలిసి తెలుగుదేశం వాళ్లు పూటకో నాయకుడిని తీసుకువచ్చి జగన్ గారి పాలనలో చాలా సంతోషంగా ఉన్న ఇక్కడ ప్రజలను రెచ్చ గొట్టే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలి అని అవినాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, వైస్సార్సీపీ నాయకులు కోటి నాగులు, డేవిడ్ రాజ్,చందా కిరణ్, సుధాకర్, సుమన, అనిల్, రమేష్, విజయ, చార్లీ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *