విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంతోపాటు క్రీడారంగానికి ప్రాతినిధ్యం ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా క్యారమ్స్ ఆడే క్రీడాకారులకు నగరంలో బెజవాడ క్యారమ్స్ కోచింగ్ & ప్రాక్టీస్ సెంటర్‌ను నగరం నడిబొడ్డులో ప్రారంభించడం శుభపరిణామని నిర్వాహకులు ఎ.వంశీకృష్ణారెడ్డి, ఎ.మనోహర్‌బాబులను ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందించారు. శుక్రవారం గాంధీనగర్‌లో బెజవాడ క్యారమ్స్ కోచింగ్ & ప్రాక్టీస్ సెంటర్ శుక్రవారం ప్రారంభించబడిరది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ బాలి గోవింద్, సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ విచ్చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎ.వంశీకృష్ణారెడ్డి, ఎ.మనోహర్‌బాబులు మాట్లాడుతూ క్యారమ్స్ మొదటిసారిగా పుట్టింది విజయవాడలోనే అని అన్నారు. దీనిని విజయవాడలో దవేదర్ అప్పారావు ప్రారంభించారన్నారు. ప్రారంభంలో మొట్టమొదటిసారిగా మూడుసార్లు నేషనల్ విన్నర్‌గా నిలిచారన్నారు. కానీ ఇప్పుడు సరైన ప్రణాళికాబద్దకమైన కోచింగ్ చేసే కోచ్‌లు లేక ఎపిలో క్యారమ్స్ వెనుబడిరదన్నారు. మరలా తిరిగి క్యారమ్స్ పూర్వ వైభవం తేవడానికి తనవంతు కృషి చేయడానికి బెజవాడ క్యారమ్స్ కోచింగ్ & ప్రాక్టీస్ సెంటర్ ప్రారంభించామన్నారు. దీనిద్వారా ఉత్సావంతులైన క్రీడాకారులను తయారు చేసి ఎపిని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ప్రారంభం 3 బోర్డులో ప్రారంభించామని, అందుబాటు ఫీజులతో మెంబర్ షిప్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడున్న యాంత్రిక విధానంలో విద్యార్దులకు మానసికోల్లాసానికి కలిగించి వారిలో నైపుణ్యం వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మేము కూడా నేషనల్ స్థాయిలో పాల్గొన్నామని తమలాగే నేటి యువతరానికి తయారుచేసి నేషనల్ స్థాయిలో ఆడి విజయకేతనం ఎగురవేయాలని తమ ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ క్యారమ్స్ ఆటగాళ్ళు, అభిమానులు తదితరులు హాజరయ్యారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …