గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రోడ్ల మరమత్తు పనులు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ మరియు ఆర్&బి సమన్వయంతో వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అన్నారు. శుక్రవారం కమిషనర్ గారు తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ, ఆర్&బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు ప్రధాన రోడ్ల మీద గోతులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సదరు పనులు వెంటనే చేపట్టాలన్నారు. విస్తరణ పనులు జరిగిన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయడానికి విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని, రానున్న 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణంపై హౌసింగ్ మరియు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణం వేగంగా చేసుకునేలా అవగాహన కల్గించాలన్నారు. లే అవుట్స్ లో ఇళ్ళ నిర్మాణంకు కాంట్రాక్ట్ తీసుకున్న వారు నిర్దేశిత గడువులోగా పనులు చేయాలన్నారు. నగరంలో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని, నవంబర్ నెలాఖరుకు పూర్తి అయ్యేలా ప్రణాళికాబద్దంగా పనులు జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి వారం ఎమినిటి కార్యదర్శులకు సమావేశం ఏర్పాటు చేసి, సచివాలయం పరిధిలో జరుతున్న పనులను సమీక్షించాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని, డి.ఈ.ఈ.లు మరింత భాద్యతగా పనుల వేగవంతం పై కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులకు టెండర్ పొంది పనులు చేపట్టని కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్ట్ లో చేర్చడం, వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు.
సమావేశంలో ఈ.ఈ.లు కొండారెడ్డి, శాంతి రాజు, సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, ఏ.డి.హెచ్. రామారావు, ఏపిసిపిడిసిఎల్ ఈ.ఈ. శ్రీనివాసరావు, ఆర్&బి మహేశ్వర రెడ్డి, నగరపాలక సంస్థ డిఈఈలు శ్రీనివాసరెడ్డి, రమేష్ బాబు, శివకుమార్, హనీఫ్ అహ్మద్, కళ్యాణ రావు, మహ్మద్ రఫిక్, హౌసింగ్ డి.ఈ.ఈ.లు, ఏపిసిపిడిసిఎల్ డి.ఈ.ఈ.లు, ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్
-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …